రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) తూర్పు రైల్వే (ER)లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,115 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి NCVT/SCVTకి సంబంధించిన ట్రేడ్‌లో సర్టిఫికేట్ పొంది ఉండాలి.
Also Read:Chiranjeevi: చిరంజీవితో నిర్మాతల భేటీ?
అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాల కంటే తక్కువ, 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష లేకుండానే ఎంపిక కావొచ్చు. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఆహ్వానిస్తారు. నియామకానికి అభ్యర్థులు వైద్యపరంగా ఫిట్‌గా ఉండటం తప్పనిసరి.
Also Read:Telangana : ఇరిగేషన్ శాఖలో ఎనిమిది మందికి చీఫ్ ఇంజనీర్ పదోన్నతులు
దరఖాస్తు ఫీజు అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 13 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.