జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోవద్దు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) ఆపరేటర్ కెమికల్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్-III, నర్స్ గ్రేడ్-II పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి UGC లేదా AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి కెమిస్ట్రీ సబ్జెక్టుతో B.Sc ఉత్తీర్ణులై ఉండాలి.
Also Read: Trump: రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్‌కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు
లేదా కెమికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. 10వ తరగతి/SSC పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అగ్నిమాపక శిక్షణా కేంద్రం నుంచి ఫైర్‌మ్యాన్‌లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు UGC గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ కోర్సు చేసి ఉండాలి. UGC గుర్తింపు పొందిన సంస్థ నుంచి B.Sc (భౌతిక శాస్త్రం) లో డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే, మెకానికల్ లేదా ఇంజనీరింగ్ మొదలైన వాటిలో ఒక సంవత్సరం డిప్లొమా కలిగి ఉండాలి.
Also Read:IND vs ENG 3rd Test: కరుణ్ నాయర్ వద్దు.. ఆ స్థానంలో సాయి సరిగ్గా సరిపోతాడు!
OBC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 33 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ. 18,000 జీతం, గరిష్టంగా రూ. 60,000 జీతం అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 25 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.