బ్యాంక్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, ఏదైనా ప్రభుత్వ రంగం/బ్యాంక్/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ కేడర్‌లో 18 నెలల అనుభవం కలిగి ఉండాలి.
Also Read:Kukatpally Sahasra Case : కూకట్ పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు
అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అంటే అభ్యర్థి 2 ఆగస్టు 1995, 1 ఆగస్టు 2005 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 850, SC, ST, PWD కేటగిరీ అభ్యర్థులకు రూ. 100 గా నిర్ణయించారు. రాత పరీక్ష, స్క్రీనింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ, తుది మెరిట్ జాబితా, స్థానిక భాషలో ప్రావీణ్యం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 4 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.