ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సీనియర్ మేనేజర్ (లీగల్/ఎలక్ట్రిక్/సివిల్), మేనేజర్ గ్రేడ్ 1 (లీగల్/ఎలక్ట్రికల్/సివిల్), మేనేజర్ గ్రేడ్ 2 (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్/ఫైనాన్స్/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read:Vidadala Rajini అందుకే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశా: విడదల రజని
పోస్టులను అనుసరించి అభ్యర్థులు BE/ BTech/ AMIE/ CA/ ICWA/ MBA (ఫిన్)/ LLB/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియర్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 70000, మేనేజర్ గ్రేడ్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60000, మేనేజర్ గ్రేడ్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50000, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40000 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 19 నుండి ప్రారంభమైంది. అర్హత ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.