జాబ్ కోసం వెతికి విసిగిపోయారా? ఎక్కడా జాబ్ దొరకడం లేదా? అయితే ఈ పోస్టులు మీకోసమే. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE) అప్రెంటిస్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బెంగళూరు లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు.
Also Read:Bhagavad Gita: “ప్రతి భారతీయుడికి గర్వకారణం”.. భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు
అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీటెక్, డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 18-27 ఏళ్లు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ. 9 వేలు, డిప్లొమా అప్రెంటిస్ కు రూ. 8 వేలు, ఐటీఐ అప్రెంటిస్ కు నెలకు రూ. 7 వేలు అందిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.