ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? మీ క్వాలిఫికేషన్ కు తగిన జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం 209 పోస్టులు భర్తీకానున్నాయి.
Also Read:Mohanlal : చిరంజీవి సినిమాపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థులు 10+2/XII లేదా తత్సమాన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం కంప్యూటర్ టైపింగ్ స్పీడు, వినియోగంలో నైపుణ్యం కలిగి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం 10+2/XII లేదా తత్సమాన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) సూచించిన నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఈ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read:Bangladesh: యూనస్‌పై తిరుగుబాటు..? ఆర్మీ అత్యవసర సమావేశం..
ఎంపికైన వారికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు జీతం రూ. 19,900 – రూ. 63,200 ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నెలకు రూ. 25,500 – రూ. 81,100 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు Unreserved (UR), OBC (NCL), EWS అభ్యర్థులు 500/- చెల్లించాలి. Women/SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 21 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.