Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కు టాలీవుడ్ తో మంచి అనుబంధం ఉంది. ఆయన సినిమాలు తరచూ తెలుగులో రిలీజ్ కావడం లేదంటే రీమక్ లాంటివి అవుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో లూసీఫర్-2 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. మార్చి 27న మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే మూవీ ప్రమోషన్లు ఇటు తెలుగులో కూడా భారీగా చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ లాలా చిరంజీవి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ లాల్ తీసిన లూసీఫర్ సినిమాను తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో చిరుతో పాటు నయనతార కూడా నటించారు. అయితే తాజాగా గాడ్ ఫాదర్ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మోహన్ లాల్ మాట్లాడారు.
Read Also : Bangladesh: యూనస్‌పై తిరుగుబాటు..? ఆర్మీ అత్యవసర సమావేశం..
‘లూసీఫర్ సినిమాతో గాడ్ ఫాదర్ తీశారు. ఆ తెలుగు వెర్షన్ నేను కూడా చూశాను. అందులో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు దాన్ని తీశారు. కానీ లూసీఫర్-2 మూవీతో గాడ్ ఫాదర్-2 తీయలేరు. ఎందుకంటే ఇందులో పాత్రలను తీసేయడం అసాధ్యం. ప్రతి పాత్రకు కథలో కీలకమైన లింక్ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు మోహన్ లాల్. లూసీఫర్ సినిమాలో ఉన్న టోవినో థామస్ పాత్రను గాడ్ ఫాదర్ లో తీసేసిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోహన్ లాల్ ఈ కామెంట్స్ చేశారు. అయితే ఎల్-2లో టోవినో థామస్ కీలక పాత్ర చేస్తున్నారు. మొదటి పార్టులో కంటే ఈ పార్టులో ఆయన పాత్ర ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతోంది. ఎల్-2 ఫుల్ యాక్షన్ మోడ్ లో వస్తోంది. మరి ఈ మూవీ ఏ స్థాయి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.