ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), స్పోర్ట్స్ కోటా (హాకీ) నుంచి హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇది ఇంటర్మీడియట్ అర్హతతో పాటు క్రీడా ప్రతిభ గల మహిళలకు సువర్ణావకాశం.
Also Read:TVS iQube S, ST 2025: ప్రీమియం ఈవీ స్కూటర్లు TVS iQube S, ST 2025 మోడళ్లను విడుదల చేసిన టీవీఎస్.!
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. హాకీలో రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. 01.08.2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ కేటాగిరి వర్గాల వారికి వయో సడలింపు నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,000 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 30 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.