ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. LIC HFL అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి.
Also Read:WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?.. హేజిల్‌వుడ్‌పై జాన్సన్ ఫైర్!
అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. ప్రవేశ పరీక్ష జూలై 3, 2025న నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశ జూలై 8 నుంచి 9, 2025 వరకు నిర్వహిస్తారు.
Also Read:Salman khan : విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్..
ఎంపికైన అభ్యర్థులకు జూలై 10, 11 తేదీల్లో ఆఫర్ లెటర్లు అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులను 12 నెలల పాటు అప్రెంటిస్‌షిప్‌లో ఉంచుతారు. ఈ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ. 12,000 స్టైఫండ్ ఇస్తారు. జనరల్, ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు రూ. 944, ఎస్సీ/ఎస్టీలకు రూ. 708, పీడబ్ల్యూడీ కేటగిరీకి రూ. 472. అభ్యర్థులు జూన్ 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.