ఇంటర్ అర్హతతో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? మంచి జీతం వచ్చే ప్రభుత్వం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. ఇంటర్ అర్హతతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. హైదరాబాద్‌లోని CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నవారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.
Also Read:Crime: అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..
ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ఇంటర్ లో పాసై ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ లో టైపింగ్ స్కిల్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. రాతపరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.38,483 చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో మే 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.