ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీపరీక్షల్లో ప్రతిభ చూపాలి. తర్వాత ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి. ప్రతి దశలో ప్రతిభ చూపితే తప్పా జాబ్ సాధించలేరు. కానీ, మీకు ఇప్పుడు రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో మెకానికల్ 150, కెమికల్ 60, ఎలక్ట్రికల్ 80, ఎలక్ట్రానిక్స్ 45, ఇన్ స్ట్రుమెంటేషన్ 45, సివిల్ 45 పోస్టులున్నాయి.
Also Read:MP Chamala Kiran: తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్!
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60శాతం మార్కులతో BE/BTech/BSc (ఇంజనీరింగ్) లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ MTech డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు 2023, 2024 లేదా 2025 నుంచి చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ తప్పనిసరి. అభ్యర్థుల వయసు జనరల్/EWS గరిష్టంగా 26 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్) గరిష్టంగా 29 సంవత్సరాలు, SC/ST గరిష్టంగా 31 సంవత్సరాలు కలిగి ఉండాలి. గేట్ స్కోర్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పిరియడ్ లో నెలకు రూ.74,000 స్టైఫండ్ లభిస్తుంది.
Also Read:Kishan Reddy: పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ.. ఓవైసీ దగ్గర వంగి వంగి సలాంలు కొడతారు!
30,000 రూపాయల వన్-టైమ్ బుక్ అలవెన్స్ కూడా అందిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, అభ్యర్థులను నెలకు రూ. 56,100 ప్రారంభ జీతంతో సైంటిఫిక్ ఆఫీసర్ (గ్రూప్ సి)గా నియమిస్తారు. జనరల్, EWS లేదా OBC (NCL) వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.