భారత ప్రభుత్వ సంస్థ, దేశంలోని అతిపెద్ద షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ కంపెనీ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL), METI హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నియామక ప్రకటన అధికారిక వెబ్‌సైట్ cochinshipyard.in లో అందుబాటులో ఉంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమైంది. నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అయితే, ఈ నియామకం చీఫ్ పెట్టీ ఆఫీసర్, మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-I లేదా మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ 2గా పనిచేసిన మాజీ భారత నావికాదళ సిబ్బందికి మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
Also Read:Kasibugga Stampede: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు..
నవంబర్ 7, 2025 నాటికి గరిష్ట వయోపరిమితి 58 సంవత్సరాలు (నవంబర్ 8, 1967 కంటే ముందు జన్మించిన అభ్యర్థులు అర్హులు కాదు). ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు రూ. 36,500, ఆ తర్వాత వార్షిక ఇంక్రిమెంట్లు లభిస్తాయి. దరఖాస్తుదారులు హిందీ, ఇంగ్లీషులో మంచి పట్టు కలిగి ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు రూ. 300 దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అయితే, SC/ST అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.