టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (RRC SECR), వివిధ విభాగాలలో 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC, PwD వంటి రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపులు నిబంధనలు వర్తిస్తాయి.
Also Read:UP: “మీరట్ మర్డర్” వీడియోలు పంపుతూ భార్యకు బెదిరింపులు..
RRC SECR అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఎంపిక మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు వారి 10వ తరగతి, ITI పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 4 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.