రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు వరంలా మారిందని, లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు లైసెన్స్ ఫీజును బార్ యజమానులు ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో వారికి ఆర్థికంగా లాభదాయకంగా మారనుందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ ప్రకారం భారీగా తగ్గనున్నది లైసెన్స్ ఫీజు .. లైసెన్స్ ఫీజును తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం.. లాభదాయకంగా పాలసీ బార్ లైసెన్స్.. గతంలో బార్ లైసెన్స్ దారులు ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన పరిస్థితి..
బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం.. కడపలో బార్ లైసెన్స్ ఫీజు గతంలో రూ.1.97 కోట్లు ఉండగా, ఇప్పుడు దానిని రూ. 55 లక్షలకు తగ్గింపు.. అదేవిధంగా అనంతపురంలో లైసెన్స్ ఫీజు రూ. 1.79 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గింపు.. తిరుపతిలో రూ. 1.72 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు.. ఒంగోలులో రూ. 1.4 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గింపు.. లైసెన్స్ దారులు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే సదుపాయం.. కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుమును రూ.5 లక్షలకు తగ్గించింది ప్రభుత్వం.