Apple iPhone 15 Series: ఒక్కసారి ఐఫోన్ వాడారంటే చాలు.. మరో ఫోన్ వైపు కన్నెత్తిచూడరు.. మళ్లీ ఫోన్ కొనాలంటే ఐఫోన్ కొత్త మోడల్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తారు.. అయితే, కొత్త మోడల్ కోసం ఎదురుచూసే ఐఫోన్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. ఎందుకంటే ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఆలస్యం కావచ్చు, సెప్టెంబర్ కాకుండా వాయిదా పడే అవకాశ కనిపిస్తోంది.. ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ సంవత్సరం ఆలస్యం కానున్నాయి. అయితే, యాపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్ జెన్‌ని సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తుంది మరియు అదే నెలలో కొన్ని రోజుల తర్వాత వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుంది. కానీ, COVID-19 మహమ్మారి కారణంగా iPhone 12 సిరీస్ లాంచ్ 2020లో సాధారణం కంటే ఆలస్యం అయింది. ఈ సంవత్సరం, రాబోయే యాపిల్ iPhone 15 సిరీస్ కూడా ఇదే విధమైన ఆలస్యాన్ని ఎదుర్కొంటుంది.
Read Also: Bro Trailer : బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. టాలీవుడ్లో మొదటిసారిగా అలా?
ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో మార్కెట్లోకి రావచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా (BOA) పరిశోధకుడు సూచిస్తున్నారు. ఐఫోన్ 15 విడుదలలో జాప్యం యాపిల్ సంస్థ యొక్క సెప్టెంబర్ త్రైమాసికంపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.. అయితే, స్క్రీన్ తయారీ సమస్యల కారణంగా ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్ సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తే.. కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని మరో నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, ఐఫోన్ 15 లాంచ్ కొన్ని వారాలు ఆలస్యం కావచ్చు అంచున్నారు.. అయితే, యాపిల్ తన కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తూ వస్తుంది. నివేదికల ప్రకారం, iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max మోడల్‌లను కలిగి ఉన్న iPhone 15 సిరీస్ సెప్టెంబర్‌లో అధికారికంగా రావాల్సి ఉన్నా.. ప్రో మోడల్ యొక్క మెటల్ షెల్‌కు స్క్రీన్ జతచేసేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయని.. దీంతో LG డిస్‌ప్లే తయారీ ప్రక్రియలో సమస్యలను ఎదుర్కొంటోందని అందుకే ఆలస్యం కావొచ్చు అని అంటున్నారు.