బుధవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభలలో ముగిసాయి. దీనికి కారణం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే. ఇక నేడు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడగా.. మొదటిసారిగా 75,000 మార్క్ ను దాటింది. ఐకమరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,753 వద్ద జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిసింది.
Also Read: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొన్న కారు, ఐదుగురు మృతి
ఇక నేడు లాభపడిన స్టాక్స్ వివరాలు చూస్తే.. ఐటీసీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్ లు లాభాలు తీసుకున్న లిస్ట్ లో ముందు ఉండగా.. మరోవైపు నష్టపోయిన షేర్స్ చూస్తే మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సెర్వ్ లు నష్టాలు తీసుకున్న లిస్ట్ లో ముందు ఉన్నాయి. ఇక విదేశీ పెట్టుబడుల విషయానికి వస్తే.. మంగళవారం నాడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FLL) రూ.593.20 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు.
Also Read: Bade Miyan Chote Miyan: ఏప్రిల్ 11న థియేటర్స్ లో బడే మియా చోటే మియా
ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయాలు చూస్తే.. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మార్కెట్ లాభాలతో, టోక్యో, షాంఘై నష్టాలతో ముగిసాయి. ఇక దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు ఎన్నికల సందర్భంగా నేడు పనిచేయలేదు. సమాచారం అందే సమయానికి యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇక రూపాయి విలువ విషయానికి వస్తే.. బుధవారం నాడు అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ 12 పైసలు లాభపడి.. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.19గా ట్రేడ్ అవుతోంది.