AP Rains: ఆంధ్ర రాష్ట్రానికి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో భారీ వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone threat to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపై వాయవ్య దిశగా కదిలి.. డిసెంబర్ 2 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొంది.
డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 4 నుంచి 6 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read
Also Read: Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్ఆర్ జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 8.8 సెంమీ వర్షపాతం కురిసింది.
తాజావార్తలు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
-
Lunar Eclipse 2026: ఆ ఏడాది చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?