AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Social Media Influencer Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇన్ఫ్లుయెన్సర్ పాలసీకి ఆమోదం లభించింది.. ఐదు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ పాలసీలను పరిశీలించిన అనంతరం పారితోషికంపై నిర్ణయం తీసుకున్నట్లు.. కేబనెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్న పారితోషికాలను పరిశీలించి, రాష్ట్రానికి అనుగుణంగా చెల్లింపులు నిర్ణయించినట్లు తెలిపారు.
ఫాలోవర్ల ఆధారంగా పారితోషికం
కొత్త పాలసీ ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్సర్లకు ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇస్తున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. కేటగిరీ–ఏలో ఉండాలంటే లక్షకు పైగా వ్యూస్ ఉండాలనే నిబంధనను కూడా పేర్కొన్నారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకు గరిష్టంగా రూ.15 వేల వరకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల నుంచి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 అందించనున్నారు.
Also Read
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ఫాలోవర్ల కేటగిరీల వారీగా చెల్లింపులు
లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకు గరిష్టంగా రూ.15 వేల వరకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల నుంచి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 అందించనున్నారు. 25 వేల నుంచి 49,999 మంది వరకు ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు రూ.5,000 చెల్లించనున్నారు. అలాగే 10 వేల నుంచి 24,999 మంది వరకు ఫాలోవర్లు ఉన్నవారికి రూ.2,500 వరకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాలను అర్హత పొందిన ఇన్ఫ్లుయెన్సర్లకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చేరవేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!