AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Exams 2027: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ చదివే విద్యార్థులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. 2027లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. సాధారణ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 29 వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులు తమ కళాశాలల ద్వారా నిర్ణీత సమయంలో ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబర్ 30 నుంచి ఫైన్‌తో..
నిర్ణీత గడువులో ఫీజు చెల్లించలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..?
ఏపీలో 2027 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.. జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనుండగా.. ఒకేషనల్ కోర్సులకు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉండనున్నాయి.. ఇక, ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.. అయితే, గతంలో అధికారులు ప్రకటించిన ప్రకారం.. ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు..
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!