Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివో సంస్థ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానున్న వీవో V80తో పాటు ‘వివో S2 FE’ మోడల్‌ను కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్లు ఒకే వేదికపై లాంచ్ అయ్యే అవకాశముంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ధరల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్కువ ధరలో మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడనుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ రూ. 40,000 కంటే తక్కువ ధరలోనే లభించనుంది. బ్లాక్, గ్రీన్ కలర్స్‌లో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్తో రానుంది.
ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ ఫోన్లో 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e 5G చిప్సెట్ అమర్చారు. పొరపాటును ఎప్పుడైనా నీటిలో పడనా.. దుమ్ము నుంచి రక్షణ పొందేందుకు ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్ లభించవచ్చని సమాచారం. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉండనుంది.
Also Read
కెమెరా విభాగంలో.. వెనుక వైపు సోనీ IMX852 సెన్సార్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ఆకర్షణ దీని 10,000mAh భారీ బ్యాటరీ కానుంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ప్రొసెసర్, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో వివో S2 FE భారతీయ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు