AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Mayor Seats Meeting: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవుల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల కీలక సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ భేటీలో పాల్గొననున్నారు.
కూటమి పార్టీల సమావేశంలో రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి?, ఏయే కార్పొరేషన్లను ఏ పార్టీకి కేటాయించాలి? అనే అంశాలపై ప్రధానంగా చర్చించనునున్నారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. మేయర్ స్థానాల కేటాయింపులో విజయవాడ కార్పొరేషన్ కీలకంగా మారినట్లు సమాచారం. విజయవాడతో పాటు మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్లలోనూ పోటీ చేసే అవకాశం కల్పించాలని జనసేన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాలపై కూటమి నేతల మధ్య ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర కార్పొరేషన్లలోనూ పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
కేవలం నగరపాలక సంస్థల మేయర్ స్థానాలకే కాకుండా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులు, వార్డు స్థాయి పోటీకి సంబంధించిన సర్దుబాటుపైనా మూడు పార్టీల నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై స్పష్టత తీసుకురావడంతో పాటు స్థానిక నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. నేటి సమావేశం ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల పంపకాలపై కీలకంగా మారనుంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?, మిగతా మేయర్ స్థానాలు, మున్సిపాలిటీలను మూడు పార్టీల మధ్య ఎలా సర్దుబాటు చేస్తారు? అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..