AP High Court: రేపు, ఎల్లుండి ఎస్సై పరీక్షలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రేపు, ఎల్లుండి నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Minister Amarnath: పవన్ ఓ పొలిటికల్ టూరిస్ట్.. రాజకీయాలకు ఆంధ్రా, నివాసానికి తెలంగాణ కావాలా…?
Also Read
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
- CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం మూడు రోజులలోపు అర్హత వున్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. రేపు, ఎల్లుండి జరిగే తుది రాత పరీక్షపై ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 14, 15 తేదీల్లో మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయని ప్రకటించింది. కాగా ఎత్తు విషయంలో తమకు అర్హత ఉన్నప్పటికీ క్వాలిఫై చేయలేదని 5 వేల మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారికి మళ్లీ టెస్టులు చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!