Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt Approves Rs.1.50 Power Supply for Aqua Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆక్వా చెరువులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు కొంత మేర ఊరట దక్కింది.
ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రైతుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకుడు తులసి రాంబాబు మాట్లాడుతూ.. విద్యుత్ సబ్సిడీ నిర్ణయం రైతులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందన్నారు. అయితే విద్యుత్ రాయితీతో పాటు ఆక్వా ఫీడ్ ధరలను కూడా ప్రభుత్వం నియంత్రిస్తే నష్టాల బాటలో ఉన్న రైతులు పూర్తిగా గట్టెక్కే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Also Read
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారని తులసి రాంబాబు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు కొనసాగించాలని ఆక్వా రైతులు ఆకాంక్షించారు. జూలై 1 నుంచి ఆక్వా చెరువులకు రుపాయిన్నరకు కరెంట్ అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఫీడ్ ధరలను నియంత్రిస్తే కోలుకుంటాం అని ఆక్వా రైతులు అంటున్నారు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!