Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడి వంటగదిపై ధరల భారం పడకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసే యోచనలో ఉంది. రాబోయే సెప్టెంబర్-నవంబర్ పండగల సీజన్లో తీపి పదార్థాలు, పిండివంటలు, స్నాక్స్ వాడకం పెరిగి ఎడిబుల్ ఆయిల్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో వంటనూనెల ధరలు దాదాపు 20 శాతానికి పైగా పెరిగి ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తున్నాయి. ఆగస్టులో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం వేగవంతమవ్వడానికి ఈ ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణమైంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ధరలను అదుపులోకి తెచ్చి, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వంటనూనెలపై దిగుమతి సుంకాలను (Import Duties) తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకునే భారత్, తన దేశీయ అవసరాలలో దాదాపు మూడింట రెండు వంతులను విదేశాల నుంచే పొందుతోంది. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను భారీగా దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఒకవైపు పండగల వేళ వినియోగదారులను ఆదుకుంటూనే, మరోవైపు దేశీయ నూనెగింజల రైతుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకే సుంకాల్లో భారీ కోత విధించకుండా, ప్రాథమిక దిగుమతి సుంకాన్ని సుమారు 5 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమల రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశీయంగా సోయాబీన్ ధరలు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తగ్గకుండా ఉండి, రైతులకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది.
Also Read
- DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ఇదివరకు మే 2025లో భారత ప్రభుత్వం ముడి వంటనూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతానికి సగానికి తగ్గించింది. దీనికి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్ కలిపిన తర్వాత క్రూడ్ పామ్ ఆయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై మొత్తం ప్రభావవంతమైన దిగుమతి సుంకం 16.5 శాతంగా మారింది. అయితే, గతంలో భారత్ సుంకాలు తగ్గించినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పామ్ ఆయిల్, సోయా ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు మళ్లీ భారత్ దిగుమతి సుంకాలను తగ్గిస్తే, అది ప్రపంచ వంటనూనెల మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ నుంచి డిమాండ్ పెరిగితే మలేషియా పామ్ ఆయిల్, అమెరికా సోయా ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. పైగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతరాయాలు, ఎల్ నినో వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాల మధ్య భారత్ దిగుమతి సుంకం తగ్గించినా, విదేశాల్లో ధరలు పెరిగితే దాని పూర్తి ప్రయోజనం స్థానిక వినియోగదారులకు అందుతుందా లేదా అనేది వేచి చూడాలి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!