Governor Abdul Nazeer: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి-గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని ఆకాక్షించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలని ప్రజలందరికీ తెలియజెప్పడానికే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం అన్నారు. అర్హులైన లబ్దిదారులందరికీ ఈ పథకాలు అందించడమే ఈ యాత్ర లక్ష్యం.. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమపథకాలపై అందరికీ అవగాహన కల్పించడంకోసం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు.
Read Also: CM Revanth Reddy: కాసేపట్లో సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి
Also Read
ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ క్రెడిట్, పీఎం పోషణ్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, పీఎం ఉజ్వల్ యోజ్ రోజ్ గార్ మేళా.. ఇలా కీలక సంక్షేమ పథకాలని కేంద్రం అందిస్తోందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. ప్రజల అవసరాలని గుర్తించి వాటిని నెరవేర్చడమే ప్రభుత్వాల లక్ష్యం అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలని అందించడంలో ముందుంది.. మహిళాభివృద్దికి ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్ర కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకి 15 వేల డ్రోన్ లు అందించడం జరుగుతుందన్నారు.
Read Also: Kodali Nani: రైతాంగం ఎవరూ ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది..
వ్యవసాయంలో డ్రోన్ కెమెరాల వినియోగంపై మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. వచ్చే 25 సంవత్సరాలలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే 25 ఏళ్ల కాలం భారత దేశానికి అమృతకాలం అన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి పాల్గొంటేనే ఈ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!