Adudam Andhra: గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసింది ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. అందులో భాగంగా క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ పెడుతోంది.. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంది.. 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం.. మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ఏపీ బ్యాడ్మెంట్ అసోసియేషన్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది ఏపీ సర్కార్.. ఇక, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ తోనూ ఒప్పందాలు చేసుకుంది.. ఈ సంస్థల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేపట్టనున్నారు.. ఇక, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు సాగిస్తున్నారు. రాబోయే ఐపీఎల్, పీకేఎల్, పీవీఎల్ సీజన్స్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కలిపించే దిశగా చర్యలకు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Read Also: Bigg Boss Telugu 7: ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్.. ఆ ఇద్దరు అవుట్?