NTV Telugu Site icon

Alla Nani: టీడీపీలో చేరేందుకు ఆళ్ల నానికి లైన్‌ క్లియర్‌!

Alla Nani

Alla Nani

Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆళ్ల నాని చేరికకు పార్టీ పెద్దలు అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో నేడో ,రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగో సారి పోటీచేసి ఓటమి పాలైన ఆళ్ల నాని రాకను వేలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read Also: NTV Effect: ద్వారకాతిరుమల ఆలయ పరిసరాల్లో డ్రోన్.. యూట్యూబర్‌పై కేసు నమోదు

2024ఎన్నికల్లో ఏలూరులో 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క నేడు, రేపు ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీపీ అధిష్ఠానం సూచించడంతో మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక తెలుగు తమ్ముళ్లలో కలవరం రేపుతోంది. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో వైసీపీని వీడి వచ్చిన నేతలు టీడీపీలోనే కొనసాగుతున్నారు. వైసీపీలో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ,ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, విభజిత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా,  ఎమ్మెల్సీగా పలు పదవులు గతంలో నిర్వహించారు.

 

Show comments