AP EAPCET Counselling 2023 Begins on July 24: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కన్వీనర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు.. జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8వరకు అవకాశం ఉంటుంది. ఇక ఐచ్ఛికాల మార్పు ఆగస్టు 9న చేసుకోవచ్చు.
ఆగస్టు 12న ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేస్తారు. సీట్లు పొందిన వారు 13-14 తేదీల్లో ఆయా కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. మరోవైపు ఇంజినీరింగ్ కళాశాలలకు గరిష్ఠంగా రూ. లక్ష, కనిష్ఠంగా రూ. 42 వేలు ఫీజు నిర్ణయించినట్లు సమాచారం తెలిసింది. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఈ ఫీజులు అమలులో ఉంటాయని తెలుస్తోంది.
గత మూడేళ్లకు గరిష్ఠంగా రూ. 70వేలు, కనిష్ఠంగా రూ. 35 వేలు ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు నిర్ణయించారు. అయితే ధరల పెరుగుదల, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ణయించినట్లు తెలిసింది. రూ. లక్ష ఫీజు ఉన్న కళాశాలలు పదిలోపే ఉండగా.. అత్యధిక కళాశాలలకు ఫీజు రూ. 42వేలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు cets.apsche.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
Also Read: IND vs WI: కేవలం 12 మ్యాచ్‌లే.. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!
Also Read: Coocaa Smart TV: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. 54990 వేల స్మార్ట్ టీవీ కేవలం 11 వేలకే!