కోలీవుడ్ లో అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు ‘లోకేష్ కనగరాజ్’. ఖైదీ సినిమా నుంచి విక్రమ్ మూవీ వరకూ లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కి పోవాల్సిందే. నైట్ ఎఫెక్ట్ లో, మాఫియా వరల్డ్ లో సినిమాలు చేసే లోకేష్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, మాస్టర్ తో బాకీ పడిన హిట్ ఈసారి గట్టిగా కొట్టాలని చూస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ అంచనాలని మోస్తున్న ఈ మూవీ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే ఖైదీ, విక్రమ్ సినిమాలను తన యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించాడు లోకేష్,’లియో’ సినిమాను మాత్రం స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గానే రిలీజ్ చేస్తున్నాడు. అందుకే లియో సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
బాహుబలి, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్, నెక్స్ట్ రాబోటీయే సలార్ సినిమాలు రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి అందుకే లియో కూడా 2 పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది అనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పార్ట్ 1 ఎండ్ లో పార్ట్ 2కి లీడ్ ఇచ్చి హైప్ పెంచనున్నారని టాక్. అయితే లోకేష్ సినిమాలని ఫాలో అవుతూ వచ్చిన వాళ్లకి ఇదేమి కొత్త విషయంలా అనిపించదు. ఎందుకంటే తన మొదటి సినిమా నగరం నుంచి ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల వరకు ప్రతి మూవీలో లోకేష్ కనగరాజ్ ఓపెనింగ్ ఎండింగే ఇచ్చాడు. పార్ట్ 2కి అవసరమైన లీడ్ ఇచ్చి సినిమాకి ఎండ్ కార్డ్ వేయడం లోకేష్ స్టైల్, అదే లియో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అంతే కానీ స్పెషల్ గా లియో సినిమాకి మాత్రమే లోకేష్ ఓపెనింగ్ ఎండింగ్ ఇవ్వడం అనేదేమి లేదు. ఎప్పటికైనా ఉపయోగ పడుతుంది అని లోకేష్ అలా ఎండింగ్ ని వదిలేస్తాడు.