AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఏపీ విద్యాశాఖ దృష్టి..
- ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు ఉండే అవకాశం లేదని స్పష్టత..
- 13 జిల్లాల ఉపాధ్యాయ నియామకాలు.. 26 జిల్లాల ప్రకారం సర్దుబాటు..
AP Education Department: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బదులుగా టీచర్ పోస్టుల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రస్తుతం 13 జిల్లాల ఆధారంగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను 26 జిల్లాల ప్రకారం సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టింది విద్యాశాఖ.. ఈ ఏడాది సాధారణ ఉపాధ్యాయుల బదిలీలు ఉండే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియ చేపట్టకుండా కేవలం పోస్టుల సర్దుబాటుపైనే దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది..
Read Also: AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
సర్దుబాటు ప్రక్రియలో స్పౌజ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్య సమస్యలు ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాత జోనల్, ప్రస్తుత జోనల్ విధానాల ప్రకారం సీనియారిటీ, రిజర్వేషన్లు మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా ఉపాధ్యాయులకు తమ సొంత జోన్‌కు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జోన్‌ల ప్రకారం ఉన్న ఉపాధ్యాయులకు తమ సొంత జిల్లా లేదా జోన్‌లో పనిచేసే అవకాశం ఇవ్వాలని పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే 26 జిల్లాలకు నోడల్ అధికారులను విద్యాశాఖ నియమించింది. ఈ అధికారులు సాధారణ పరిపాలన శాఖ (GAD), ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోస్టులు, సిబ్బంది వివరాలు, ఖాళీలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఉపాధ్యాయుల అవసరాలు, విద్యార్థుల నిష్పత్తి, పాఠశాలల అవసరాల ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది సమస్య కొంతవరకు పరిష్కారం కానుంది.
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!