తాజాగా ఏపీఈఏపీ సెట్ పరీక్ష వాయిదా పడింది. నిజానికి మే 13వ తేదీ నుండి ఈఏపీ సెట్ పరీక్షలు మొదలవ్వాల్సి ఉంది. కాకపోతే ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ కారణంగా ఈఏపీసెట్ ను మే 16కి వాయిదా వేశారు. ఇందులో భాగంగా ముందుగా మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనుండగా.. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. వీటితోపాటు జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీసెట్ జూన్ 10వ తేదీకి వాయిదా పడింది. ఏపీ పీజీసెట్ పరీక్షలు సంబంధించి జూన్ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతున్నారు.
ALSO READ: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ నోటిఫికేషన్ గత ఏడాది కాకినాడ జేఎన్‌టియూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగానే.. ఈఏపీసెట్ 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ను కాకినాడ జేఎన్‌టియూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోటిఫికేషన్ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ ( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ/సీఏ అండ్ బీఎం) లాంటి విభాగాల్లో అడ్మిషన్లను ఇవ్వబోతున్నారు.
ALSO READ: Gold Price Today: మహిళలకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు!
ఇందుకుగాను విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లను పూర్తి చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా 25 % కోటాలను భర్తీ చేయనున్నారు. పరీక్ష సిలబస్, మోడల్ పేపర్ల కోసం లాంటి వివరాల కోసం ఈఏపీసెట్ వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచారు అధికారులు. ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ పరికగా ఈ ఏపీసెట్ 2024ను ద్వారా నిర్వహిస్తారు.