* తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,320.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,900
* APPSC గ్రూప్-1 పరీక్షపై ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. 2018 APPSC గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన ఏపీపీఎస్సీ
* జగిత్యాల జిల్లా: ఘనంగా కొనసాగుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ రోజు సాయంత్రం గోధూలి సుముహూర్తమున స్వామి అమ్మవార్ల కల్యాణం..
* తిరుమల: రెండో రోజు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ శ్రీకృష్ణుని అవతారంలో తెప్పల పై విహరించనున్న స్వామివారు
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసిన టిటిడి
* ప్రకాశం : చీమకుర్తి మండలం ఏలూరి వారిపాలెం, గోనుగుంటలలో మంత్రి మేరుగ నాగార్జున ప్రచార కార్యక్రమం..
* ప్రకాశం: మర్రిపూడి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పృదులగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈనెల 29 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు..
* ప్రకాశం: దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో వైసీపీ ఇంచార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎన్నికల ప్రచార కార్యక్రమం..
* ప్రకాశం : ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* కడప : బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో, బద్వేలు కలసపాడు మండలాలలో పర్యటించనున్న నారా భువనేశ్వరి.
* అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో
ఉదయం 10 గంటలకు కోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కరూపానంద రెడ్డి గ్రామం ముక్కవారిపల్లిలో పర్యటించనున్న నారా భువనేశ్వరి
* ప్రొద్దుటూరు 41 వ వార్డులో ఎమ్మెల్యే రాచమళ్లు ఎన్నికల ప్రచారం…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు
* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నారాయణరావుపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్
* నెల్లూరు: ఆత్మకూరులోని వైసీపీ కార్యాలయంలో నేతలతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మాణంలో కీలక పనులు.. ఎఫ్ఓబీకి గడ్డర్లు అమర్చి కుడి, ఎడమ వంతెనలను అనుసంధానం చేస్తున్న నిర్మాణ సంస్థ.. నేటి నుండి కీలకమైన పనుల కారణంగా 15 రోజులు మోరంపూడి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టిన రాజమండ్రి పోలీసులు
* కర్నూలు: రేపటి నుంచి కోడుమూరు మండలం గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు.. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఊంజలసేవ, బంగారు పల్లకి, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
* తిరుమలలో 11 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69072 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26239 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు
* కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూర్ లో శ్రీ వుచ్చీరప్ప తాత రథోత్సవం.. పాల్గొనున్న భక్తులు.
* హైదరాబాద్ లో నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఉదయం బాగ్ అంబర్‌పేట్ డివిజన్ లో వివిధ బస్తిల్లో పర్యటిస్తారు.. నందనవనం, శారదా నగర్, సంజయ్ గాంధీ నగర్, సాయిబాబా నగర్, సీఈ కాలనీలో కొనసాగనున్న పర్యటన
* తిరుపతి జనసేన నేతలకు అధిష్ఠానం నుండి పిలుపు .. స్థానికులకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జనసేన నేతలు.. నేడు నాగబాబుతో సమావేశం