AP DGP Rajendranath Reddy: బాలికలు, మహిళల అదృశ్యం నిజమే.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DGP Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్‌లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 2019-21 మధ్య 26వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైతే.. 23 వేల మంది తిరిగొచ్చారని ఆయన చెప్పారు. అంతకుముందు సంవత్సరాల్లో తప్పిపోయిన వారిని కలపటం వల్లే 30వేల మంది అని లెక్కలు చెబుతున్నారని డీజీపీ అన్నారు. శాంతిభద్రతలపై కడప జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read: Andhrapradesh: సీఎం జగన్‌తో తిరుపతి ఎమ్మెల్యే భూమన భేటీ.. కీలక పదవిపై చర్చలు!
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్‌పై రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా సమాచారం ఇచ్చారు. ఏపీలో 2019 నుంచి 2021 వరకు 7,918 మంది బాలికలు, 22,278 మంది మహిళలు, యువతుల అదృశ్యమయ్యారని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దీనిపై డీజీపీ వివరణ ఇచ్చారు.
మరోవైపు, రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని డీజీపీ వెల్లడించారు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తామని ఆయన అన్నారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై మరింత శిక్షణ ఇస్తామని డీజీపీ చెప్పారు. పోలీస్ సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రాజమండ్రిలో క్రీడల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..