ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది వరకే పలువురు ఉన్నతాధికారులు ఈసీ బదిలీ చేసింది. తాజాగా ఏపీ డీజీపీ కే. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి రిలీవ్ అవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డికి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 2019-21 మధ్య 26వేల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైతే.. 23 వేల మంది తిరిగొచ్చారని ఆయన చెప్పారు.
తనను డీజీపీగా ఎంపికచేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు కే.రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తన పై ఇంత నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు. జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుంది