Kolagatla Veerabhadra Swamy: ఎన్టీఆర్ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా..? జూ.ఎన్టీఆర్‌ని అణగదొక్కలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolagatla Veerabhadra Swamy: ఏపీ స్కిల్ స్కామ్, అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు, చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభా సమావేశాల సమయాన్ని టీడీపీ సభ్యులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కేసులను ఎత్తివేయమని శాసనసభా సమావేశాల్లో అడగడం అవివేకమన్న ఆయన.. టీడీపీ సభ్యులు కవ్వింపు చర్యలకు దిగారు. సభను సక్రమంగా నడవనీకుండా ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం సృష్టించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటకు రావాలి అని సవాల్ చేశారు. తన కేసులపై ఉన్న స్టే అన్నింటిపైన విచారణ జరిపి కడిగిన ముత్యంలా బయటకు రావాలని సూచించారు.
ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో చంద్రబాబు సభ్యుడా? అని ప్రశ్నించారు కోలగట్ల.. ఎన్టీఆర్ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా? అని మండిపడ్డ ఆయన.. లోకేష్ కు అడ్డుగా ఉన్నాడని.. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని స్టేలు ఎత్తి వేయించుకొని విచారణ జరిపించుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి.. ఇంకా మూడు రోజులు సభ జరుగుతుంది టీడీపీ సభ్యులు చెప్పాల్సింది సభకు వచ్చి చెప్పండి అని సలహా ఇచ్చారు. సీఐడీ కస్టడీలో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి అన్నారు కోలగట్ల వీరభద్రస్వామి.
Also Read
- Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఖండిస్తున్నా.. అసెంబ్లీని ప్రక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ పనిచేసింది.. మితిమీరిన ప్రవర్తన కలిగిన సభ్యులను సస్పెండ్ చేశారు.. స్పీకర్ పై దౌర్జన్యం చేసేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని దుయ్యబట్టారు కోలగట్ల.. తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ కవ్వింపు చర్యలకు దిగారు.. సభ జరగకుండా ప్లాన్ చేశారు అని అర్థం అయిన తరువాత సభ్యులను సస్పెండ్ చేశారని విరించారు. అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు నిజాయితీని బయటపెట్టే అవకాశం ఉన్నా.. దానిని చేజార్చుకున్నారని.. అసెంబ్లీలో చర్చకు సహకరించ లేదు అంటే అవినీతి జరిగిందని టీడీపీ సభ్యులకు తెలుసని కామెంట్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు.. అతన్ని విచారణ కోసం టీడీపీ పిలిపించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏ మారుమూల దాక్కున్నా తీసుకువస్తారు.. శాసనసభ లో మాట్లాడకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.
తాజావార్తలు
-
King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?