Pawan Kalyan : ఏపీ రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మరించారు. వారి త్యాగం ఎన్నటికీ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించి ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ ఉన్నతాధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ (IFS) ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. Abhinay:…
తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఐపీఎస్ అధికారులపై మాజీ సీఎం వైఎస్ జగన్ బెదిరింపులు ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతామన్నారు. మహిళల సంరక్షణ తమ మొదటి ప్రాధాన్యత అని, అందుకోసం ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం…
మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ…