Pawan Kalyan: హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి అంటూ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా వికారాబాద్, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది.. ఓల్డ్ సిటీ, పురానాపూల్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్.. ఇలా మూసీ నది పరివాక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది.. ఈ నేపథ్యంలో.. జనసేన నేతలకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదతో ఎంజీ బస్టాండ్, పరిసరాలు నీట మునిగాయని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు జనసే అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Story Board: హైడ్రాను తిట్టినోళ్లే పొగడ్తలు కురిపిస్తున్నారు.. బతుకమ్మ కుంటకు పునర్జీవం..