Pawan Kalyan: హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి అంటూ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా వికారాబాద్, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది.. ఓల్డ్ సిటీ, పురానాపూల్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్.. ఇలా మూసీ నది పరివాక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది.. ఈ నేపథ్యంలో.. జనసేన నేతలకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్..…