AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం మంగళవారం-బుధవారం నాటికి మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని సూచించింది. తుఫాన్ ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా సుమారు 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా దాదాపు 1,040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా తీవ్రత పెంచుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా బలపడిన అనంతరం ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు కదిలి.. తీరం దాటే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
- Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
- U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
తుఫాన్ ప్రభావంతో సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈరోజు సాయంత్రంలోగా తీరానికి తిరిగి రావాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తదుపరి సూచనలు వచ్చే వరకు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. తుఫాన్‌కు సంబంధించిన తాజా సమాచారం, అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని తీర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!