Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Spy Network: ఆంధ్రప్రదేశ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ చేపట్టిన ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 18 మందిని అనుమానితులుగా గుర్తించిన అధికారులు.. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో నేరుగా సంబంధాలు కొనసాగించినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విశాఖపట్నంలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా కీలక సమాచారాన్ని పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌కు చేరవేశారా అనే అంశాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ పరిశీలిస్తోంది. అనుమానితుల్లో ఇద్దరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
విశాఖలో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అరెస్ట్
ఈ కేసులో విశాఖకు చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌కు చేరవేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనను కోర్టులో హాజరుపరచగా అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో విశాఖ జిల్లా జైలుకు తరలించారు.
కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగి అరెస్ట్
ఇదే కేసులో కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌కు చెందిన వాట్సాప్ యాక్టివేషన్ కోసం OTP షేర్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో కమ్యూనికేషన్, కీలక సమాచారాన్ని చేరవేసిన అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రదీప్ ముఖర్జీని ట్రాన్సిట్ వారెంట్‌పై కోయంబత్తూరు నుంచి విజయవాడకు తరలించారు. అనంతరం కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నట్లు సమాచారం.
మిగిలిన అనుమానితులపై దర్యాప్తు
మొత్తం 18 మంది అనుమానితుల్లో మిగిలిన 16 మందికి సంబంధించిన పాత్రపై కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో వారి సంబంధాలు, సమాచార మార్పిడి, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. అయితే, విశాఖలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్లిందా? ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!