Congress: కాంగ్రెస్‌పై వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. గెలుపు సంగతి తర్వాత.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను కూడా రాబట్టలేకపోయింది.. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంపై ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు.. కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదు.. మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీడబ్ల్యూసీ మెంబర్లు.. ఇలా కాంగ్రెస్ పెద్దలకు మొరపెట్టుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: NEET Results 2024 : ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. పరీక్ష రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ఇక, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకుని పదవులు అనుభవించిన నాయకులు వెళ్లిపోయారని విమర్శించారు పద్మశ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పనిచేశాం.. సొంత డబ్బులు, అప్పులు చేసి మరీ పార్టీ కోసం పనిచేశామన్నారు.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనుకున్నా.. నేను కేడర్ కి న్యాయం చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు సుంకర పద్మశ్రీ.. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం, ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. కాగా, టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ సుంకర పద్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. విజయవాడ తూర్పు టిక్కెట్ ను ఆమెకు ప్రకటించారు.. కానీ, తాను ఎంపీ టిక్కెట్ ను అడిగానని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేయడం.. ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!