CM YS Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి .. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తోన్న విషయం విదితమే.. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని ఈ రోజు రీయింబర్స్మెంట్ చేయనున్నారు. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు 9 నుండి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తుండగా.. మహిళల పై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తోంది ప్రభుత్వం.. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల రూపాయలను బ్యాంకు రుణం అందించి ప్రభుత్వం.. ఇక, వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు ఇవాళ వడ్డీ రీఎంబర్స్ మెంట్ చేయనున్నారు సీఎం జగన్.. 46.90 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు.. సంవత్సరంలో రెండు సార్లు వడ్డీ రీఎంబెర్స్మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
Read Also: Chiranjeevi: బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Also Read
- Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తారు.. తొలి దఫా కింద 4,07,323 మందికి రూ.46.90 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు సీఎం జగన్.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. ఇక, పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా, మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!