మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో చేసుకున్న విషం తెలిసిందే.. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు.. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు.. ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా వారి పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పిల్లలు పాల్గొన్నారు..
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు చిరంజీవి ఫామ్ హౌస్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఎప్పుడు దాన్ని కొనుగోలు చేశారు? ఎన్ని కోట్లు పెట్టారు..అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్ బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉందట.. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉంటుంది. దేవనహళ్లి టిప్పు సుల్తాన్ జన్మస్థలం కాగా, ఈ ప్రాంతాన్ని మైసూర్ టైగర్ అని పిలుస్తారు.
ఈ ఫామ్ హౌస్ ఎంతో విశాలంగా ఉంది.. ఒక పెళ్లిని కూడా చెయ్యొచ్చు అని చెబుతున్నారు.. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ఫామ్ హౌస్ ధర సుమారు రూ. 30 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పండుగలు, వేడుకలను తరచుగా ఈ ఫామ్ హౌస్ లో జరుపుకుంటారు. బంధువులు, మిత్రులు అంతా అక్కడికి చేరుకుని ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి సందర్భంగానూ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫామ్ హౌస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక మెగా హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..
#Boss Megastar Chiranjeevi’s House In Bangalore ..
Loved It 👌👌 pic.twitter.com/HhK1pY7U9k— Ahiteja Bellamkonda (@ahiteja) February 10, 2015