Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dare Devil: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి చేతులు కలిపిన అజిత్ కుమార్ కొత్త మూవీ ‘డేర్ డెవిల్’ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలంగా AK64 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ దశలోకి అడుగుపెడుతోందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులో ‘డేర్ డెవిల్’ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు. మొదట ఈ సినిమా 2026 ఫిబ్రవరిలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ, నిర్మాత ఖరారు కాకపోవడంతో ప్రాజెక్ట్ ఆలస్యమైందని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలినీ అజిత్ కుమార్ తన కొత్త బ్యానర్ బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్‌పై నిర్మించనున్నన్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం మోహన్‌లాల్ పేరు. తొలుత ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పారితోషికానికి సంబంధించిన కారణాల వల్ల మోహన్‌లాల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అనిరుధ్ రవిచందర్ సంగీతం. ‘వేదాలం’, ‘వివేగం’, ‘విడాముయర్చి’ తర్వాత అజిత్‌తో ఆయన మరోసారి కలిసి పనిచేయడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. అధిక్ రవిచంద్రన్ కూడా ఈ మూవీని గుడ్ బ్యాడ్ అగ్లీ తరహా యాక్షన్ డ్రామా కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కథలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా సమాచారం.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
అజిత్ చివరిసారిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్’ అగ్లీలో కనిపించారు. ఆ చిత్రంలో రెడ్ డ్రాగన్‌గా పేరొందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ఏకే పాత్రలో ఆయన నటనకు మంచి స్పందన లభించింది. త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించిన ఆ సినిమా తర్వాత వస్తున్న ‘డేర్ డెవిల్’పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ తేదీలు, నటీనటుల పూర్తి వివరాలు, మోహన్‌లాల్ అంశం వంటి విషయాలు ఆఫీషియల్ గా బయటికి రాలేదు. అయినప్పటికీ సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో ‘డేర్ డెవిల్’ చుట్టూ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.
- Tags
- cinema
- Dare Devil
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?