NTV Telugu Site icon

CM Jagan Delhi Tour: హస్తినలో పొలిటికల్‌ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్‌

Jagan

Jagan

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హస్తినలో హీట్‌ పెంచుతున్నాయి.. నిన్నటి నిన్న ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చలు జరిపారు.. ఈ రోజు ఉదయం ఆయన హస్తిన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్‌.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్‌ మంత్రులను కూడా సీఎం జగన్‌ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు

రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్‌.. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్‌, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్‌.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించనున్నారని తెలుస్తోంది.. ఇక, ఏపీలో ఎన్నికల పొత్తులు హీటు పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే జనసేన-బీజేపీ, టీడీపీ-జనసేన మధ్య పొత్తులు ఉండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసే వెళ్లే విధంగా నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.. ఇప్పటికే అమిత్‌ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు ముగియగా.. ఇక, ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీ వెళ్లనున్నారని ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

CM Jagan To Meet PM Modi Tomorrow | Ntv