YS Jagan: మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా మునుపెన్నడూ చూడనిది అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికార పక్షం వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని, తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు.. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు.
Read Also: Venkatesh: వెంకీ మామ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ లదే సందడంతా
చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టంకట్టిన ప్రభుత్వంకూడా మనదే అన్నారు సీఎం జగన్.. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. రాబోయే రోజుల్లోకూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. ఈరోజు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర’’ ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి.. పేదవాడి విజయానికి బాటలు వేయాలి. దాదాపు 60 రోజులకు పైగా సామాజిక సాధికర బస్సు యాత్రలు జరుగుతాయని.. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి.. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తారని.. ప్రతీ రోజు సాయంత్రం ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తాం అన్నారు.. ఈ సభలకు స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు.. నేతల ఉపన్యాసాలు ఉంటాయని వెల్లడించారు.. ఇది మామూలు బస్సు యాత్ర కాదు.. ఒక సామాజిక న్యాయ యాత్ర.. పేద సామాజిక వర్గాలను కలుపుకుపోయే యాత్ర.. పేదల పక్షాన నిలబడే యాత్ర.. అని పేర్కొంటూ..#SamajikaSadhikaraYatra హాష్ ట్యాగ్‌ను జత చేసి తన ఉపన్యాసాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం… pic.twitter.com/kcj6CkhDOE
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2023