Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండోవ కుమార్తె హయవాహిని నిశ్చితార్థం గతరాత్రి విజయవాడ లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ స్వగృహంలోనే ఈ వేడుక నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వెంకేటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇప్పటికే పెద్ద కుమార్తె ఆశ్రీత వివాహం 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటుంది. అక్కడ నుంచే ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఫుడ్ వీడియోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె చెల్లి హయవాహిని. ప్రస్తుతం ఆమె చదువును పూర్తిచేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఒక అథ్లెట్ అని సమాచారం. ఇక ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది.
Sreeleela: లిప్ లాక్ ను దాచేసిన శ్రీలీల.. వామ్మో, మామూలుది కాదుగా!
వరుడు.. విజయవాడకు చెందిన డాక్టర్ కుటుంబానికి చెందినవాడు. ఇక వెంకటేష్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అందుకే పెద్ద కూతురు వివాహాన్ని కూడా చాలా సింపుల్ గా చేసాడు. ఇక రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం కూడా చాలా సింపుల్ గా జరిపించారు. ఇక ఈ నిశ్చితార్ధ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ దంపతులదే హడావిడి. ఇక ఈ వేడుకలో రానా, నాగ చైతన్య తదితరులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి వచ్చే ఏడాదిలో ఉండనుందని తెలుస్తోంది. మరి పెళ్ళికి అయినా వెంకీ ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుస్తాడేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.