ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లా కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటనలో ఉండనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అభి ఫంక్షన్ హాల్‌కు చేరుకొని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ఫర్సన్ జకీయా ఖానం కుమారుడు ముష్రఫ్ అలీ ఖాన్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే.