Chandrababu: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

  • తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
  • కుటుంబంతో స్వామివారి దర్శనానికి ముఖ్యమంత్రి
  • చంద్రబాబుకు స్వాగతం పలికిన టీటీడీ జేఈవో గౌతమి
Tirumala

Tirumala

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. బుధవారం సాయంత్రం నూతన మంత్రులతో సమావేశం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన చంద్రబాబు.. రాత్రి అక్కడ బస చేశారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

Read Also: Chandrababu: సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం!

తిరుమల నుంచి చంద్రబాబు విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ దుర్గగుడిలో అమ్మవారికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నరాు. తిరుమల నుంచి గన్నవరం విమానాశ్రయం వచ్చి నేరుగా దుర్గమ్మ దర్శనానికి రానున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనం చేసుకుని ఉండవల్లిలో ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.