CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.. మే 15 నుంచి ప్రారంభం..
- జాబ్ ఫస్ట్ అనేది ఏపీ ప్రభుత్వ నినాదం..
- మే 15 నుంచి నోటిఫికేషన్లు..
- 10,060 పోస్టులను భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ‘జాబ్ ఫస్ట్’ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగాల భర్తీ షెడ్యూల్..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
మే 15, 2026 నుంచి అక్టోబర్ 15, 2026 మధ్య కాలంలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలోనే ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 6 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన ద్వారా ప్రైవేటు రంగంలో ఈ ఏడాది మరిన్ని లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Also Read:Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేసి, ప్రతిభతో ఉద్యోగాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం గురించి చర్చించారు. అధికారులు అందించిన ప్రాథమిక అంచనాలను పరిశీలించిన సీఎం, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని, త్వరితగతిన నివేదికలు అందజేయాలని అధికారులను సూచించారు. రైతులకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!